SRCL: జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం వచ్చే నెల రోజులలో జిల్లా పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.