Drink tea: భారతదేశంలో టీ , కాఫీ బాగా ప్రాచుర్యం పొందాయి. చాలా మందికి, ఉదయం టీ , కాఫీ తోనే రోజు ప్రారంభిస్తారు. మళ్లీ సాయంత్రం అయితే చాలు అప్పుడు కూడా టీ, కాఫీ తాగుతూ ఉంటారు. కానీ… వీటిని ఎలా పడితే అలా ఏ సమయంలో పడితే అలా తాగడకూదని మీకు తెలుసా అయితే ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. నిజం ఏమిటంటే చాలా మంది ఈ అలవాట్ల నుండి తేలికగా బయటపడలేరు. చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. అయితే ఇది చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది.
ముఖ్యంగా కాఫీ-టీ తాగే అలవాటు ఐరన్ గ్రహించడంలో అంతరాయం కలిగిస్తుంది. పోషకాహార నిపుణులు దీనిని టీ, కాఫీలలోని పాలీఫెనాల్స్, టానిన్లు అని పిలుస్తారు. భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగితే, మనం తినే ఆహారం నిజమైన ప్రయోజనాలను కోల్పోతాము. ఇది సాధారణ పద్ధతి అని మీరు అనుకోవచ్చు. కానీ అది మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే టీ కాఫీ తాగడం వల్ల తీవ్రమైన ఐరన్ లోపం , రక్తహీనత ఏర్పడుతుంది. అంతే కాదు, అలా చేయడం వల్ల అలసట పెరుగుతుంది.