»Pesticides In Your Chai Karnataka To Crack Down On Tea After Gobi Manchurian And Cotton Candy
Pesticides Chai: మనం తాగేది ‘టీ’ కాదు.. పురుగులమందు?
టీ ప్రియులకు ఇది పిడుగులాంటి వార్త.. రోడ్లమీద లభించే టీలో పురుగులమందులకు ఉపయోగించే రంగులు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బయటపెట్టింది.
Pesticides Chai: చాలా మందికి టీ తాగందే రోజు మొదలు అవ్వదు. ఇక ఈ వర్షాకాలంలో ఎక్కడికెళ్లినా టీ తాగడం పరిపాటి. అయితే ఇకపై రోడ్లమీద టీ తాగలంటే కాస్త ఆలోచించుకోవాలి అంటుంది ఫుడ్ సేఫ్టీ అథారిటీ. మాములుగా టీ ఆకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో పురుగుమందులు, రంగులు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSS) బయటపెట్టింది. ఇందులో రోడమైన్-బి, కార్మోయిసిన్ వంటి టాక్సిక్ ఫుడ్ కలరింగ్లు, టీ పొడితో పాటు కొన్ని ఆహార పదార్థాల్లో కనుకొన్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమే కాదు క్యాన్సర్కు దారితీస్తాయి. ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అని, టీ తోటల్లో ఎక్కువ మొత్తంలో పురుగులమందులు వాడడాన్నిఅరికట్టాలని, అలా చేసిన నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది.
టీ నమూనాల పరీక్ష
టీని ఎక్కువగా వినియోగించుకునే ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల నుంచి 48 రకాల నమూనాలను సేకరించారు. బాగల్కోట్, బీదర్, గదగ్, ధార్వాడ్, హుబల్లి, విజయనగరం, కొప్పల్, బళ్లారి వంటి జిల్లాల నుంచి సేకరించిన నమూనాలలో పురుగులమందులు ఎక్కువగా వాడుతున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. ఆ ఫర్టిసైడ్స్ ఆరోగ్యాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తాయని చెప్పారు. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు మాట్లాడుతూ “మేము పరీక్షించి, టీ ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకుంటాము. నాణ్యత లేని, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తీసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడం మా లక్ష్యం” అని మంత్రి పేర్కొన్నారు.
పరిమితులకు మించి పురుగుమందులు వాడుతున్నారు.
రైతులు, తేయాకు ఉత్పత్తిదారులు ప్రాసెసింగ్ సమయంలో అనుమతించదాని కంటే ఎక్కువ మొత్తంలో పురుగుమందులను కలుపుతున్నారని ఆహార నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ పురుగుమందులు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని, ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్పారు. టీ ఉత్పత్తిదారులు పెద్ద మొత్తంలో పురుగుమందులను ఉపయోగిస్తున్నట్లు ల్యాబొరేటరీ 35 నుంచి 40 రకాల నమునాలను పరీక్షించిన సీనియర్ అధికారి తెలిపారు.
నిషేధించిన ఫుడ్ కలర్ వాడుతున్నారు.
ఇది వరకే కర్ణాటక ప్రభుత్వం గోబీ మంచూరియ, కబాబ్స్ వంటి ఆహార పదార్థాలలో రోడమైన్-బి, కార్మోయిసిన్ వంటి విషపూరిత ఫుడ్ కలరింగ్ నమూనాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే వాటిని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. రోడమైన్-బి అనేది ఆహారాన్ని ఆకర్షణీయంగా చూపించడానికి వాడుతారని, అది క్యాన్సర్కు దారితీస్తుందని తెలిపారు. ఈ కలప్పై పరీక్షలు సైతం నిర్వహించి ఇది శరీరానికి హానికరం అని నిర్ధారించారు. మొత్తం బయట రోడ్లమీద దొరికే వంటల్లో 107 రకాల కృత్రిమ రంగులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ప్రభుత్వం నిషేధించిన వాటిని ఉపయోగిస్తే హోటల్ యజమానులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా ఉంటుందని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది.