ALMONDS : రోజూ మూడు బాదం గింజలతో బ్రెయిన్ యమ యాక్టివ్
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకునే వారు చాలా మంది రోజూ మూడు, నాలుగు బాదం గింజల్ని తప్పకుండా తింటుంటారు. మరి ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అవేంటంటే?
ALMONDS HEALTH BENEFITS : చాలా మంది మూడు, నాలుగు బాదం గింజల్ని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తింటూ ఉంటారు. అలా తింటే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ నిజంగా దీని వల్ల ఏం ప్రయోజనాలు(HEALTH BENEFITS) ఉన్నాయనేది మాత్రం చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రండి.
రోజూ మూడు నాలుగు బాదం పప్పులు(ALMONDS) తినడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో రిబోఫ్లేవిన్, ఎల్ కార్నిటైన్ అనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ లాంటి వాటిని రాకుండా చేస్తాయి. మధుమేహ సమస్యలు ఉన్న వారు తప్పకుండా రోజూ బాదం పప్పుల్ని తినాలి. షుగర్ని కంట్రోల్లో ఉంచడంలో బాదాం సహకరిస్తుంది. ఇవి మనలో ఇన్సులిన్ సెన్సిటివిటీని సైతం పెంచుతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
బాదాంలో(ALMONDS) మంచి కొవ్వులు ఉంటాయి. వీటిల్లో ఉండే మోనో సాచ్యురేటెడ్ ఫ్యాట్లు గుండెకు మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ని పెంచుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. మలబద్ధకం లాంటివి లేకుండా ఉంటాయి. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. వీటిలో ఉండే అధికమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కాబట్టి చర్మం కాంతి విహీనంగా ఉన్న వారు వీటిని రోజూ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.