Health Tips: ఈ 5 ఆహారాలు తినేవారికి అలర్ట్..ఆపకుంటే కలిగే నష్టాలివే
నేటి రోజుల్లో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్(Diabetes), బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని కల్గిస్తున్నాయి. అందుకే పరిమితంగానే వాటిని తీసుకోవడం మంచిది.
నేటి రోజుల్లో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్(Diabetes), బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. జీవన విధానం, వారు పాటించే ఆహారపు అలవాట్ల వల్లే అటువంటి పరిస్థితి నెలకొంటోంది. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని కల్గిస్తున్నాయి. అందుకే పరిమితంగానే వాటిని తీసుకోవడం మంచిది. అయితే చాలా మంది ఇష్టానుసారం వాటిని తింటూ ఉండటం వల్ల వారికి తెలియకుండానే కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంద. కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యంపై ఎంతగానో దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఒబేసిటీ, డయాబెటీస్(Diabetes) వంటి సమస్యలు ఇప్పుడు ఎక్కువ మందిలో ఉన్నాయి. అందుకే మనం క్రమంగా వాడే కొన్ని ఆహార పదార్థాలు గురించి, వాటిని ఏ విధంగా వాడాలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ భోజనం లేకుండా ఉండలేరు. మరికొందరు అన్నాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ భోజనాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో అందులో ఉండేటటువంటి పోషకాలు అనేవి తొలగిపోతాయి. అందువల్లే వైట్ రైస్ తినడం వల్ల టైప్2 డయాబెటిస్(Diabetes) ముప్పు అందర్నీ వెంటాడుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రతి రోజూ మూడు పూటలా అన్నం తినకుండా మధ్య మధ్యలో చపాతీలు, పూరీ, రవ్వతో చేసిన పదార్థాలు, మరికొన్ని టిఫిన్స్ వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అందరూ బంగాళదుంపను ఇష్టంగా తింటారు. అదంటే అందరికీ చాలా ఇష్టం. అయితే స్థూలకాయం, డయాబెటిస్(Diabetes) వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత తక్కువగా బంగాళదుంపలను తీసుకోవాలి. ఈ బంగాళదుంపలో స్టార్చ్, కార్బొహైడ్రేట్స్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేసి తినడం లేకుంటే వెన్న, క్రీమ్ లతో కలిపి తీసుకోవడం మానుకోవడం ఉత్తమం. అలాకాకుండా బంగాళదుంపను వెన్న, క్రీమ్ లతో కలిపి తింటే అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకోవడం హానికరం. వీటిని ఎక్కువగా తీసుకుంటే డయాబెటీస్(Diabetes) సమస్యే కాకుండా క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుంది.
చాలా మంది పంచదార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వైట్ ఫుడ్స్ లో పంచదార అనేది మరింత ప్రమాదకరమైనది. ఈ పంచదార తీసుకున్నాక అది నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే చాలా మందికి డయాబెటీస్(Diabetes) సమస్య తలెత్తుతూ ఉంటుంది. అందుకే చక్కెర కలిగిన పదార్థాలు సాధ్యమైనంత వరకూ తక్కువగా తీసుకోండి.
ప్రతి వంటకూ ఉప్పు చాలా అవసరం. ఉప్పు లేకపోతే ఆహారం అంత బావుండదు. అయితే పరిమితికి మించి ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి చెడు చేస్తుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో తగిన సోడియం, క్లోరైడ్ సమస్య ఉప్పు కారణంగానే వస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో బ్లడ్ వెస్సెల్స్ దెబ్బతింటాయి. బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అంతేకాకుండా కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఉప్పును సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోకండి.
ఈ మధ్యకాలంలో చాలా మంది మైదాతో చేసిన పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మైదాతో తయారయ్యే వైట్ బ్రెడ్, కేక్, బిస్కట్స్, పేస్ట్రీ వంటి పదార్థాలు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. గర్భిణులు మైదా తినడం అంత మంచిది కాదు. మైదా వల్ల టైప్2 డయాబెటిస్(Diabetes) ముప్పు వాటిల్లుతుంది.