Deverakonda wants Rashmika : విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్లోను ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్లోను ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. వాళ్లు కూడా కలిసి వెకేషన్లకు వెళ్తూ.. హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. కానీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని.. ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. అయితే రష్మిక, రౌడీ కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పరుశురామ్ ‘గీత గోవిందం2’ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఈ హిట్ జోడినే నటించనుంది. అయితే ఈలోపే మరోసారి తెరపై కనిపించేదుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. అయితే సామ్ హెల్త్ కారణంగా షూటింగ్ లేట్ అవుతు వస్తోంది. కానీ తాజాగా మార్చి ఒకటి నుండి ‘ఖుషి’ కోసం సామ్ డేట్స్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఖుషిలో రష్మిక కూడా నటిస్తోందని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. కానీ అందులో వాస్తవం లేదని తెలిసింది. అయితే ఎలాగైనా సరే.. ఖుషిలో రష్మికను తీసుకోవాలని చూస్తున్నాడట రౌడీ హీరో. సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయకపోయినా.. కనీసం స్పెషల్ సాంగ్లో అయినా రష్మికను తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నాడట విజయ్ దేవరకొండ. ఇప్పటికే రష్మికని కూడా ఒప్పించినట్లు టాక్. ఇదే నిజమైతే.. ఖుషికి మరింత హైప్ రావడం పక్కా. మరి ఖుషిలో రష్మిక ఉంటుందో లేదో చూడాలి.