Weight Loss Tips : బద్ధకంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవిగో టిప్స్
కొంత మందికి బరువు తగ్గాలని ఉంటుంది కానీ ఆ ఎక్స్ర్సైజులు, డైట్‌లూ పాటించడమంటేనే ఇష్టం ఉండదు. అందుకనే తగ్గేందుకు ప్రయత్నించరు. ఇలాంటి వారు బద్ధకంగా బరువు తగ్గేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే...
Weight Loss Tips : తేలికగా బరువు తగ్గాలనుకునే వారు చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అదెలాగంటే… తినేప్పుడు మైండ్ ఫుల్‌గా ఉండండి. టీవీ చూస్తూనో, మొబైల్లో వెబ్ సిరీస్‌లు చూస్తూనో భోజనం చేయవద్దు. ప్లేట్లో పెట్టుకున్న ఆహారాన్ని పరిశీలనగా చూడండి. నోట్లో దాన్ని మనం ఎలా నములుతున్నాం? ఎలా మింగుతున్నాం? రుచి ఎలా ఉంది? ఏమేమి పదార్థాలను దానిలో వాడి ఉంటారు? లాంటి వాటన్నింటినీ గమనించండి. ఆనందంగా బాగా నములుతూ తినండి. అందువల్ల అతిగా తినకుండా ఉంటాం.
ఆకలి వేస్తున్నప్పుడు సాధారణంగా ఎంత తింటారో దానిలో సగం మాత్రమే తినేందుకు ప్రయత్నించండి. ఆహారం తినడం మొదలు పెట్టక ముందే సూప్, సలాడ్లను తీసుకోండి. అప్పుడు భోజనం తక్కువ తినే సరికి కడుపు నిండిపోతుంది. ఇవన్నీ చేయడం వల్ల తేలికగా బరువు తగ్గగలుగుతారు. తిన్న తిండిలోంచి మనకు ఎన్ని క్యాలరీలు వస్తాయి? అనేది తెలుసుకోవడం మొదలుపెడితే మనం ఎక్కువగా తినకుండా ఉండగలుగుతాం. అలాగే అనారోగ్యకర ఆహారాలను తగ్గించండి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉన్న వాటిని తినండి.
స్వీట్లు, పంచదార వేసి చేసిన టీలు, పండ్ల రసాలను తీసుకోకండి. బదులుగా తీపి లేని పండ్ల రసాలు, గ్రీన్‌టీ లాంటివి తాగేందుకు ప్రయత్నించండి. అలాగే మెట్లు ఎక్కడం, దిగడం చేయండి. ఇంట్లో మాప్ చేయడం, దులపడం లాంటి పనులు చేయండి. దగ్గరలో ఉన్న దుకాణానికి నడిచి వెళ్లి కూరగాయలు తెండి. ఇలా శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా వేగంగా ఉంచండి. అప్పుడు క్యాలరీలు అవే కరుగుతాయి.