»Pm Modi Reveals Names Of Astronauts Picked For Gaganyaan Mission
Gaganyaan : గగనయాన్ వ్యోమగామల పేర్లను ప్రకటించిన మోదీ
మన దేశంలో తొలిసారిగా మానవ సహిత స్పేస్ మిషన్ ‘గగనయాన్’ను ప్రయోగించనున్నారు. దానిలో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు భారతీయ వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు.
గగనయాన్ మిషన్ భారత దేశం తలపెట్టిన తొలి మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ప్రోగాం. దీనికి సంబంధించిన పనులు ఇస్రో సెంటర్లో జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత లాంచ్ తేదీని వెల్లడిస్తారు. ఈ స్పేస్ ఫ్లైట్ దానిలో ఉన్న సిబ్బందిని భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిట్లో ప్రవేశ పెట్టగలదు. మూడు రోజుల తర్వాత వారిని క్షేమంగా మన సముద్రపు జలాల్లో ల్యాండింగ్ చేయగలదు.
ఈ మిషన్కి సంబంధించిన పరీక్షలను ఇస్రో ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2024 రెండో త్రైమాసికంలో దీని అసలు పరీక్ష ఉండబోతోందని తెలుస్తోంది. 2024 నుంచి 2025లోపు ఈ మిషన్ని విజయవంతం చేయాలని ఇస్రో భావిస్తోంది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ను అంతరిక్షంలో రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2040 నాటికి తొలి భారతీయుడిని చందమామ మీదికి పంపించాలని భావిస్తోంది.