»Delhi He Ate Coins And Magnets For Body Building What Happened Next
Delhi: బాడీ బిల్డింగ్ కోసం నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు.. తర్వాత ఏమైందంటే?
బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ శరీరానికి పొందాలనే ఉద్దేశంతో ఓ పేషెంట్ నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు. కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు.
Delhi: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ శరీరానికి పొందాలనే ఉద్దేశంతో ఆ పేషెంట్ నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు. దీంతో తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డాడు. 20 రోజుల నుంచి చాలా ఇబ్బందిపడ్డాడు. అసలు ఏం తినలేకపోయాడు. దీంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు సిటీ స్కాన్ చేయగా.. అతని కడుపులో నాణాలు, అయస్కాంతాలు ఉన్నట్లు తెలిపారు.
చిన్న పేగులో రెండు చోట్ల మ్యాగ్నెట్లు, కాయిన్లు నిలిచిపోయినట్లు సర్జరీలో డాక్టర్లు తెలిపారు. దీనివల్ల ఆహారం తీసుకున్న లోపలికి వెళ్లలేదని తెలిపారు. పేగు కోసం ఆ నాణాలను, మ్యాగ్నెట్లను తీశారు. రూ.1, రూ.2, రూ.5కు చెందిన 39 నాణాలు, రకరకాల ఆకారంలో ఉన్న 37 మ్యాగ్నెట్లను కడుపు నుంచి తీశారు. సర్జరీ తర్వాత ఏడు రోజులకు అతన్ని డిశార్చ్ చేశారు. శరీర బలం కోసం జింక్ అవసరమని, అందుకే మ్యాగ్నెట్లును మింగినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. నాణాల్లో జింక్ మూలకం ఉంటుందని.. అది కడుపులో ఎక్కువసేపు ఉండాలంటే మ్యాగ్నెట్ అవసరమని ఆ రెండు తీసుకున్నట్లు వ్యక్తి తెలిపాడు.