VZM: జిల్లాలో పనిచేస్తున్న పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తూ అనారోగ్య కారణంగా హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు తేజకు పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించారు.