»Mission Gaganyaan Project Launch Postponed Due To Technical Issue
Gaganyaan: చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా..కారణమిదే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వ్యోమగాములను పంపడానికి భారతదేశ ప్రతిష్టాత్మక మిషన్ అయిన గగన్‌యాన్ మిషన్ నేడు ప్రయోగించే క్రమంలోనే చివరినిమిషంలో నిలిపివేశారు. అయితే ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్ లాంచ్‌ను అడ్డుకుందని, అవకతవకలపై అధ్యయనం చేస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
mission gaganyaan project launch postponed due to technical issue
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి నేడు ప్రయోగించాల్సిన ప్రతిష్టాత్మక గగన్‌యాన్(Gaganyaan) మిషన్ ప్రయోగాన్ని నిలిపివేశారు. మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను ఈ రోజు ఉదయం 8:45 గంటలకు చేయాల్సి ఉంది. అయితే టెస్ట్ వెహికల్ లిఫ్ట్ ఆఫ్ ఈరోజు జరగలేదని సాంకేతిక లోపం కారణంగా చివరి నిమిషంలో దీనిని నిలివేసినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయోగం నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇస్రో చీఫ్ తెలిపారు. ఇంజిన్ ఇగ్నిషన్ జరగకపోవడంతో ప్రయోగాన్ని నిలిపివేశామని..అన్ని మళ్లి పరిశీలించుకుని పరీక్ష తర్వాత చేపడతామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి దీని ప్రయోగానికి మొదట షెడ్యూల్ చేశారు. తొలి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (TV-D1) క్రూ ఎస్కేప్ సిస్టమ్ (CES) పనితీరును ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే ఈ ప్రయోగం వాయిదా పడింది. అయితే మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడమే గగన్‌యాన్ మిషన్ లక్ష్యం. వారిని మూడు రోజుల మిషన్ కోసం 400 కిలోమీటర్ల ఎత్తులో తక్కువ భూమి కక్ష్యలో ఉంచడం కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. అయితే 2025 నాటికి వారిని అక్కడికి పంపించి మళ్లి భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడమే లక్ష్యంగా ఈ మిషన్ కొనసాగనుంది.
అందుకోసం సిబ్బందిని LVM3 రాకెట్‌ని ఉపయోగించి నిర్ణీత కక్ష్యకు రవాణా చేస్తారు. ఆ రాకెట్ ఘన, ద్రవ, క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లతో సహా వివిధ దశలను కలిగి ఉంటుంది. అందుకోసం గగన్‌యాన్ మిషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. పలు అంశాల్లో ఎస్కేప్ సిస్టమ్ ప్రభావాన్ని అంచనా వేయడం, మిషన్ లాంచ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చేలా అనేక విషయాలను తెలుపనున్నారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడానికి సిబ్బంది ఎస్కేప్ సిస్టమ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినందున ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం చాలా కీలకం. ఇది క్వాలిఫికేషన్ టెస్టింగ్ ప్రాసెస్, అన్‌క్రూడ్ మిషన్ ఫేజ్‌లలో కీలకమైన మైలురాయిని కల్గి ఉంటుంది. అయితే మొదటి టెస్ట్ సక్సెస్ అయితే మిగతా పరీక్షలకు మార్గం సుగమం అవుతుందనుకున్న క్రమంలోనే ఇలా జరిగింది.