»Gangs Of Godavari Postponed Again Is This The New Release Date
Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?
మరో వారం రోజుల్లో థియేటర్లోకి వస్తుందనుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా.. అసలు ఎప్పుడు థియేటర్లోకి రానుంది.
Gangs of Godavari' postponed again.. Is this the new release date?
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని.. ఫైనల్‌గా మే 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేశారు. రీసెంట్గా విశ్వక్ సేన్, నేహా శెట్టి లిప్‌లాక్ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి వైరల్ చేశారు. ఎమోషన్స్‌తో మిమ్మల్ని షాక్‌కు గురి చేసే ఇంటెన్స్ టేల్ పది రోజుల్లో మీ ముందుకు రాబోతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ అయింది. కారణాలు ఏదైనా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది.
మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్లోకి రావడం పక్కా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. రెండు వారాలు వెనక్కి వెళ్తు మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుందని ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. కొంచెం ఆలస్యం అయినా కూడా లంకల రత్న మాస్ మామూలుగా ఉండదని చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత, మాస్ కా దాస్ ‘ఫలక్‌నుమాదాస్’ రిలీజ్ అయిన రోజే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్లలోకి రాబోతోందని అన్నారు. ధమ్కీ, గామి సినిమాల సక్సెస్ జోష్‌లో విశ్వక్ నుంచి వస్తున్న ఈ మాస్ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ.. విశ్వక్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తున్నారు మేకర్స్.