»The War Is With Me Vijay Devarakonda Announces Solid Projects
Vijay Devarakonda: యుద్ధం నాతోనే.. విజయ్ దేవరకొండ సాలిడ్ ప్రాజక్ట్స్ అనౌన్స్!
ఈసారి రౌడీ చేయబోయే యుద్ధం తనతోనేనని సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ. బర్త్ డే సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించాడు. ఈ రెండు సినిమాలు కూడా విజయ్ కెరీర్లో చాలా స్పెషల్‌గా నిలిచేలా ఉన్నాయి.
The war is with me.. Vijay Devarakonda announces solid projects!
Vijay Devarakonda: ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ కావడంతో.. మరోసారి దిల్ రాజుతో సినిమా చేస్తున్నడు విజయ్. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని తెలిపారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. పోస్టర్లో కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ విజయ్ దేవరకొండ కత్తి పట్టుకొని ఉన్నాడు. అంటే, ఈ సారి పక్కా మాస్ కథతో విజయ్ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. కత్తి, నెత్తురు, యుద్ధం అంటున్నారంటే.. ఖచ్చితంగా రౌడీ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడనే చెప్పాలి.
ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ లోటును తీర్చేలా దిల్ రాజు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇక రౌడీ బర్త్ డే గిఫ్ట్‌కి మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇతిహాసాల నేపథ్యంలో.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా లుక్ సినిమా పై ఆసక్తిని పెంచేసేలా ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ కొత్త సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. మరి ఈ సినిమాలతో రౌడీ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో చూడాలి.