KRNL: జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.