»Is It True Do You Get Diabetice Whether You Eat Eggs
Egg : రోజూ కోడి గుడ్డు తినేవారికి మధుమేహం రిస్క్ : అధ్యయనం
మనలో చాలా మంది శరీరానికి పోషకాహారం అందించేందుకు గుడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా రోజూ వీటిని తినడం వల్ల మంచిదేనా? ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఈ విషయమై జరిగిన ఓ అధ్యయనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Eggs : చాలా మంది ఎక్కువగా ఇష్టపడి రోజూ తినే ఆహారాల్లో గుడ్లు ఒకటి. వీటిని మనం పౌష్టిక ఆహారంగా భావిస్తాం. అయితే ఇలా రోజూ వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అని ఓ అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా, చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఏకంగా 18 ఏళ్ల పాటు ఈ అధ్యయనం చేశారు. దానిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు వెల్లడయ్యాయి. అవేంటో మనమూ చదివేద్దాం మరి.
రోజూ గుడ్లు తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్(diabetes) వచ్చే అవకాశం పెరుగుతోందని ఆ అధ్యయనంలో తేలింది. రోజూ ఒకటి, లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఈ రిస్క్ ఎక్కువ అవుతున్నట్లు తెలిసింది. రోజుకు 50 గ్రాముల కంటే తక్కువగా గుడ్లను తీసుకునే వారిలో 25 శాతం డయాబెటిస్ రిస్క్ పెరుగుతోంది. అదే 50 గ్రాములను మించి వీటిని తినే వారిలో ఆ రిస్క్ 60 శాతం మేర పెరుగుతోందని పరిశోధకులు నిర్ధారించారు.
ఇలా మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు వాటిని కేవలం ఉడకబెట్టుకుని మాత్రమే తినడం ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు. దానికి ఉప్పు, కారం, నూనె లాంటివన్నీ జోడించి తినడం వల్ల డయాబెటీస్(diabetes) ప్రమాదం మరింత పెరుగుతోందని తెలిపారు. అలాగే కూరగాయల ముక్కలతో వెజిటెబుల్ ఆమ్లెట్ల లాంటివి చేసుకుని తినడం వల్ల మధుమేహం రిస్క్ కాస్త తగ్గుతుందని సూచించారు. కూరగాయల్లో ఉండే పీచు పదార్థాల వల్ల ఈ రిస్క్ తగ్గుతుందని తెలిపారు.