వారం రోజుల ముందే చిరు, బాలయ్య ఫ్యాన్స్‌కు సంక్రాతి మొదలైపోయింది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు టీజర్, సాంగ్స్‌తో పోటీ పడిన ఈ సినిమాలు.. ఇప్పుడు ట్రైలర్‌తో టెంపర్ లెపేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా ఓ రేంజ్లో నడుస్తోంది. ఒంగోలులో జరుగుతున్న ఈ మాస్ జాతరకు అభిమానులు పోటేత్తడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలయ్య కటౌట్స్ ఒంగోలును ముంచెత్తినట్టు కనిపిస్తోంది. ఈ ఈవెంట్లోనే థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. రాత్రి 8 గంటల 17 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బాలయ్య వీరభిమాని గోపీచంద్ మలినేని.. ఈ ట్రైలర్లో వీరసింహుడి ఉగ్రరూపం చూపించబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ వచ్చిన కొన్ని గంటల్లోనే వాల్తేరు వీరయ్య ట్రైలర్ కూడా రాబోతోంది. ముందుగా 8వ తేదీన వైజాగ్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరయ్య థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారని అనుకున్నారు. కానీ బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మైత్రీ మూవీ మేకర్స్. అందుకే ఈవెంట్‌కు ఓ ముందుగానే.. అంటే జనవరి 7న వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌తో ప్రకటించారు. ఇందులో కత్తి పట్టుకొని ఊచకోతకు వెళ్తున్నాడు మెగాస్టార్. దాంతో దర్శకుడు బాబీ చెబుతున్నట్టు పూనకాలు లోడింగ్ అంతకుమించి అనేలా ఉన్నట్టే కనిపిస్తోంది. అంతేకాదు ఫైనల్ అవుట్ పుట్ చూసి మరింత ఎగ్జైట్ అవుతున్నాడు బాబీ. దాంతో వాల్తేరు వీరయ్య ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందే ట్రైలర్‌తో దుమ్ముదులపనున్నారు చిరు, బాలయ్య.