ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికా పర్యటనలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాలీవుడ్లో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా రెండు నామినేషన్లు పొందింది. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీని గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సెర్మనీలో భాగంగా.. లాస్ ఏంజెల్స్ లోని టిసిఎల్ చైనీస్ ఐమ్యాక్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం తారక్‌కు ప్రత్యేకంగా గ్రాండ్ వెల్కమ్ అరేంజ్మెంట్స్ చేసారు యుఎస్ఏ ఫ్యాన్స్. వెల్కమ్ టూ హోమ్ ఆఫ్ హాలీవుడ్ యంగ్ టైగర్.. అంటూ ఎల్ఈడి మూవీ ట్రక్స్, హోర్డింగ్స్ పై ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్, రాజమౌళి ‘ది డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఈవెంట్లో చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యానిమల్ సీన్ గురించి.. నాటు నాటు పాట గురించి చర్చించారు. ఆ పాటను తెరకెక్కించిన విధానం.. జంతువులతో చేసిన సన్నివేశం గురించి.. తాను అసలు ఊహించలేదని.. అంత గొప్పగా రాజమౌళి వాటిని తెరకెక్కించారని అన్నాడు తారక్. అలాగే రాజమౌళి తన ‘గైడింగ్ సోల్’ అని చెప్పుకొచ్చాడు. అయితే క్లైమాక్స్ కోసం జక్కన్న 65 రాత్రులు హింసించాడని అన్నాడు. ఇదే ఆర్ఆర్ఆర్ గురించి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకున్నారు.