Samuthirakani: సముద్రఖని మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.
బ్రో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ కోసం సముద్రఖని దాదాపు సంవత్సరం కేటాయించారు. ఇక, సినిమా విడుదల కావడంతో ఆయన ఫ్రీ అయ్యారు. అందుకే, మళ్లీ ఆయన యాక్టింగ్ చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. సముద్రఖని ఇప్పుడు వివిధ భాషల్లో పలు యాక్టింగ్ అసైన్మెంట్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
సముద్రఖని ఎంత మంచి నటుడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన ఇప్పటికే తమిళ, తెలుగు సినిమాల్లో తన నటతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు దర్శకత్వం కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల బ్రో సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఇది ఆయన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. కాగా, ఇప్పుడు ఆయన విలన్ రోల్స్ ఎంచుకోవడం మొదలుపెట్టాడట. ఇండియన్ 2 తో పాటు, గేమ్ చేంజర్ మూవీల షూటింగ్స్ లో ఆయన జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు.