NLG: సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. సైబర్ నేరాల పట్ల పోలీసు శాఖ, అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారి వలలో పడే వారి సంఖ్య పెరుగుతుంది. 2025లో 1169 ఫిర్యాదులు వచ్చాయని పోలీసు వర్గాలు తెలిపాయి. డిజిటల్ అరెస్టుతో బెదిరించి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.