BHPL: పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నరేశ్ నెల క్రితం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేసి కనుగొన్నారు. ఇవాళ SI, బాధితుడు నరేశ్‌కు ఫోన్ అందజేశారు. SI మాట్లాడుతూ.. ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా కనుగొనవచ్చని SI సూచించారు.