అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్‌కే కాదు.. బాక్సాఫీస్‌కు కూడా పూనకాలు తెప్పిస్తున్నాడు వాల్తేరు వీరయ్య. రెండు దశాబ్దాలు చిరు, రవితేజను బిగ్ స్క్రీన్ పై ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో చిరు, రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి ఏడ్చేస్తున్నారు కూడా. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’.. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. 140 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల టాక్.
ఈ వసూళ్లతో మెగాస్టార్ కెరీర్లోనే వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఇక బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. మెగాస్టార్ టైటిల్ రోల్ ప్లే చేయగా.. వీరయ్య తమ్ముడి పాత్రలోఏసీపీ విక్రమ్ సాగర్‌గా రవితేజ నటించాడు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్యలో నటించింనందుకు రవితేజ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ ఈ సినిమా కోసం 17 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరు మాత్రం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.