పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. పాన్ వరల్ట్ స్థాయిలో ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్గా మేకింగ్ వీల్ అంటూ రిలీజ్ చేసిన ఓ వీడియో సినిమా పై అంచనాలను పెంచేసింది. ఒక్కటైర్ తయారు చేయడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తోంది చిత్ర యూనిట్. ఒక్క టైర్కే ఇలా ఉంటే.. సినిమాలో ఇంకెన్ని అద్భుతాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కానీ అప్పుడే బిజినెస్ మొదలైనట్టు సమాచారం. ఏషియన్ సునీల్ కేవలం ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు 70 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు టాక్. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. షూటింగ్ స్టేజ్‌లోనే ఇంత పెద్ద డీల్ రావడం విశేషం అనే చెప్పాలి. అంతేకాదు.. మిగతా ఏరియాల్లోను ‘ప్రాజెక్ట్ కె’ కనీ విని ఎరుగని బిజినెస్ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే.. ప్రాజెక్ట్ కె రిలీజ్‌కు ముందే సలార్, ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ జూన్‌లో వస్తుండగా.. సలార్ సెప్టెంబర్‌లో రానుంది. ఈ సినిమాలు ఏ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. ప్రాజెక్ట్ కె పై అంచనాలు పీక్స్కెళ్లిపోతాయి. అందుకే కాబోలు నైజాంలో అంత డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ రూపొందిస్తోంది. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.