పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మహానటి వంటి క్లాసికల్ హిట్ తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి లుక్ రివీల్ చేయలేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన జస్ట్ హ్యాండ్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ప్రీ లుక్ రిలీజ్ చేశారు. జనవరి 5న ఆమె బర్త్ డే సందర్భంగా.. విష్ చేస్తూ ఓ డార్క్ మోడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దీపిక ఫుల్ కటౌట్‌ను చూపించారు. కానీ మొహం కనిపించకుండా.. డార్క్ థీమ్ అప్లై చేశారు. ‘చీకటి కమ్మినపుడు ఈమే ఓ ఆశాకిరణం’ అంటూ పరిచయం చేశారు. అయితే ఈ లుక్ దీపికకు పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ అని తెలుస్తోంది. ఆమె గెటప్, హెయిర్, చేతికున్న కట్లు చూస్తే.. యాక్షన్ మోడ్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. దాంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలె రిలీజ్ చేసిన వీల్ మేకింగ్ వీడియోతో.. ప్రాజెక్ట్ కె ఎలా ఉంటుందనే ఆసక్తిని పెంచేసింది. అందుకు తగ్గట్టే.. అప్పుడే కేవలం నైజాం ఏరియాలో 70 కోట్ల బిజినెస్ డీల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ ఎలా తెరకెక్కిస్తున్నారో ఊహించుకోవచ్చు. మరి భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.