గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి రోజుకో రచ్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమా, స్పిరిట్.. ఇవన్నీ అఫిషీయల్ మూవీస్. వీటితో బాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇదిలా ఉండగానే దిల్ రాజు బ్యానర్లో మరోసారి ప్రశాంత్ నీల్‌తో ‘రావణం’ అనే సినిమా ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే సలార్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ లైనప్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిరా మావా ప్రభాస్ రేంజ్ అంటున్నారు. ఈ క్రమంలో మరో న్యూస్ మరింత వైరల్‌గా మారింది. సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ చేయబోయే మూవీ మల్టీ స్టారర్ అని తెలుస్తోంది. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ‘వార్’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ప్రభాస్‌తో మల్టీ స్టారర్ ప్లానింగ్‌లో ఉన్నాడట సిద్దార్థ్. వార్ లాగే ప్రభాస్-టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ ట్రై చేస్తున్నాడట. మైత్రీ వారు కూడా ఈ క్రేజీ కాంబోను ఫిక్స్ చేసేందుకు గట్టిగానే కసరత్తులు చేస్తోందట. అయితే టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో ఉంటాడో లేడో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం.. భారీ యాక్షన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. ఇకపోతే.. ప్రస్తుతం సిద్దార్థ్ తెరకెక్కించిన షారుఖ్ ఖాన్ ‘పటాన్’ మూవీ జనవరి 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాతే ప్రభాస్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.