హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. కన్నప్పతో తన మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నానని తెలిపారు. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూ...
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని సంఘటన గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో తాను బ్రేకప్ బాధ ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఆ బాధతో మూవీ షూటింగ్ సెట్‌లో కూర్చొని ఏడ్చేశానని.. పాత్ర కోసం సిద్ధమవుతున్నప్పటికీ కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.
ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల వేడుక నిన్న రాత్రి ఘనంగా జరిగింది. నేరుగా OTTలో విడుదలైన చిత్రాలు, సిరీస్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు అందుకున్నారు. సాయిదుర్గా తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్...
పుష్ప-2 సినిమా ఈ నెల 5న విడుదలవుతున్న నేపథ్యంలో.. ప్రీ సేల్‌లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఓవర్సీర్‌లో హవా చూపిన ఈ చిత్రం.. తాజాగా ఉత్తరాదిన కూడా సత్తా చాటుతోంది. హిందీ వెర్షన్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. ప్రీ సేల్ బుకింగ్స్ లోనే రూ.60కోట్లకు పైగా వసూలు చేసిన...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజా సాబ్’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక పోస్టర్ విడుదల కానుంది. కాగా రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో రాజా సాబ్ మూవీ తెరకెక్కుతోంది.
గత ఏడాది నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఓ కథ చెప్పినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ కథ మెగాస్టార్‌కు విపరీతంగా నచ్చేసిందని.. ఆయన ఓకే చెప్పారని సమాచారం. చిరు విశ్వంభర, ది ప్యారడైజ్ సినిమాల తర్వాత ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కనున్నట్...
నటసింహం బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన తొలి సినిమా తెరకెక్కనుంది. అయితే మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వకముందే మరో సినిమాకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోక్ష రెండో సినిమాను వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిందట. దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా జరిగాయట. సితారా బ్యానర్లో సినిమాను నిర్మిస్తున్నట్లు...
తన ఇంటికి పెద్దకోడలిగా రాబోతున్న శోభితపై అక్కినేని అమల కామెంట్స్ చేశారు. ‘ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక’ అని అన్నారు.
మెగా ప్రిన్స్ వరున్ తేజ్ నటించిన ‘మట్కా’ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయితే తరువాతి సినిమా మంచి డైరెక్టర్‌తో తీసేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీతో జతకట్టనున్నాడట. ఈ సారి సీరియస్ యాక్షన్ మూవీ కాకుండా హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్నాడట. కాగా ఈ మూవీ షూటింగ్ 2025 మార్చిలో ప్రారంభం కానుందని టాక్ వినిపిస...
12Th ఫెయిల్, సెక్టార్ 36, హసీన్ దిల్‌రుబా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎందరినో ఆకట్టుకున్న బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మస్సే అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఈ రోజు ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలని, 2025 తరువాత నటనకు గుడ్‌బై చెబుతానంటూ వెల్లడించాడు.
ఆత్మహత్యకు పాల్పడిన కన్నడ నటి శోభిత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు, కన్నడ సీరియళ్లు, పలు సినిమాల్లో నటించిన శోభితకు గతేడాది HYDకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవటంతో అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిలో శోభిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున...
హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 14న రిలీజై మిక్సిడ్ టాక్‌కే పరిమితం అయింది. అయితే ‘కంగువా’ రిలీజ్‌కు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీ...
జీ తెలుగు: చక్రం (9AM), మిస్టర్ (12PM); ఈటీవీ: సందడే సందడి (9AM); జెమినీ: దొంగ దొంగది (8.30AM), సరదాబుల్లోడు (3PM); స్టార్ మా: బిగ్ బాస్ (9AM); స్టార్ మా మూవీస్: ప్రిన్స్ (7AM), ఖాకీ సత్తా (9AM), బిచ్చగాడు 2 (12PM), తెనాలి రామకృష్ణ BA BL (3PM), కాంతార (6PM), ప్రతిరోజూ పండగే (9PM); జీ సినిమాలు: క్రేజీ ఫెలో (7AM), ప్రేమించుకుందాం.. రా (9AM), దొర (12PM), చినబాబు (3PM), దమ్ము […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే ముంబైలోని ఓ థియేటర్‌లో మాత్రం ‘పుష్ప 2’ టికెట్ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు. జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్‌లో ఏకంగా రూ.3వేలు చూపిస్తోంది. అక్కడకు వెళ్లే ప్రేక్షకుడికి వీఐపీ తరహాలో సౌకర్యాలు ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్...