• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘పుష్ప 2’ .. ‘బుక్‌ మై షో’లో మరో రికార్డు

హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప -2 నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ పలు రికార్డులను సృష్టిస్తుంది. ‘బుక్‌ మై షో’లో ఒక గంటలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ప్రచార చిత్రాలు, పాటలు, అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పింది.

December 6, 2024 / 04:17 AM IST

నా హృదయం ఉప్పొంగుతోంది: నాగార్జున

అక్కినేని నాగచైతన్య-శోభితల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను ‘X’ వేదికగా పంచుకున్న నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ‘నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది. మా ప్రియమైన కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీర్వాదాలు మరువలేనివిగా చేశాయి. ఈ పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు. మీరందరూ మాతో పంచుకున్న ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మాపై కురిపించిన...

December 5, 2024 / 09:29 PM IST

BREAKING: అల్లు అర్జున్‌పై కేసు నమోదు

TG: సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. నిన్న థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఒక బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫారసు చేశామని పేర్కొన్నారు.

December 5, 2024 / 08:43 PM IST

దీపక్ సరోజ్ కొత్త మూవీ ప్రారంభం

సిద్దార్థ రాయ్ చిత్రంతో హీరోగా పరిచయమైన దీపక్ సరోజ్ మరో రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యదు వంశీ, క ఫేమ్ సుజిత్-సందీప్ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించారు. హీరోయిన్లుగా దీక్షిక, అనైరా నటిస్తుండగా.. రఘుబాబు, సత్య, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ మ్యూజ...

December 5, 2024 / 07:12 PM IST

చిరంజీవిని కలిసిన ‘పుష్ప’ టీమ్‌

‘పుష్ప-2’ టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, యేర్నేని, సీఈవో చెర్రీ, దర్శకుడు సుకుమార్.. చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విశేషాలను చిరు అడిగి తెలుసుకున్నారు. అయితే సినిమాలో.. ‘ఎవడ్రా బాస్? ఎవడికి రా బాస్? ఆడికి.. ఆడి కొడుక్కి.. ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అంటూ పుష్ప డైలాగ్ అల్లు, మెగా ఫ్యామిలీ...

December 5, 2024 / 07:01 PM IST

VIRAL PHOTO: కీర్తి సురేశ్‌ వెడ్డింగ్‌ కార్డు

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు కాబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆంథోనీ అట్చిని పెళ్లి చేసుకోనుంది. తొలుత ఫ్రెండ్స్ అయిన వీరు.. తర్వాత ప్రేమలో పడ్డారు. తాజాగా పెద్దల అంగీకారంతో పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. ఈనెల 12న వీరి వివాహం వైభవంగా జరగనుంది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌ కార్డు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వేడుకకు కొంతమంది అతిథులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్...

December 5, 2024 / 06:59 PM IST

ఆ కుటుంబానికి అండగా ఉంటాం: మైత్రి మూవీ మేకర్స్‌

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తోపులాటపై ‘పుష్ప ది రూల్‌’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ స్పందించింది. థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో మహిళ మరణించిన వార్త వినగానే హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన  బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది.

December 5, 2024 / 03:55 PM IST

FLASH: జబర్దస్త్ కమెడియన్‌కు యాక్సిడెంట్

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ సమీపంలో షూటింగ్‌కు వెళ్తుండగా కారు సడన్ బ్రెక్ వేశారు. దీంతో ముందు వెళ్తున్న కారును రాంప్రసాద్ కారు ఢీకొట్టగా, ఆయన కారును వెనక నుంచి ఓ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

December 5, 2024 / 03:50 PM IST

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే అమరన్ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

December 5, 2024 / 12:55 PM IST

పుష్ప-2 సినిమా లీక్

భారీ స్థాయిలో విడుదలైన పుష్ప-2 సినిమా అప్పుడే లీక్ కావడం కలకలం రేపుతోంది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్‌లైన్‌లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా, సుమారు రూ.500కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

December 5, 2024 / 12:29 PM IST

నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటే సినిమా హిట్టేనా?

సినిమాల రైట్స్ తీసుకుంటున్న OTTల విషయంలో ఓ సెంటిమెంట్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఏ సినిమా తీసుకున్నా ఫ్లాప్ అవుతుందని.. నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ చర్చించుకుంటున్నారు. కంటెంట్ బాగున్నా వేట్టయన్, కంగువా.. PRIMEలో వచ్చి డిజాస్టర్లు అయ్యాయని.. దేవర, అమరన్, లక్కీ భాస్కర్, తాజాగా పుష్ప-2 నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా సూపర్ హిట్ అయ్యాయని నెటిజన్‌లు భా...

December 5, 2024 / 11:57 AM IST

‘తప్పు నాదే.. అలా కొట్టి ఉండకూడదు’

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ గతేడాది అభిమానిని కొట్టడం వివాదంగా మారింది. షాట్‌ మధ్యలో అడ్డు రావడంతో నటుడు అసహనానికి గురై అభిమాని తలపై కొట్టారు. ఈ విషయంపై తాజాగా నానా పటేకర్‌ స్పందించారు. ‘తప్పు నాదే. అలా చేసి ఉండకూడదు. షాట్‌ మధ్య అతడు రావడం వల్ల నాకు కాస్త కోపం వచ్చింది. అభిమానులు ప్రేమను వ్యక్త పరచడానికి సమయం, సందర్భం చూసుకోవాలి’ అని అన్నారు.

December 5, 2024 / 11:19 AM IST

‘రోటీ కపడా రొమాన్స్’ ఓటీటీ డేట్ ఫిక్స్

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ప్రకటించింది. మరోవైపు కొరియన్ డ్రామా ‘టెన్ మాస్టర్’ను ఈరోజు నుంచి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ‘లీలా వినోదం’ మూవీని డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ...

December 5, 2024 / 10:51 AM IST

CONTROVERSY: మెగా ఫ్యామిలీపై బన్నీ డైలాగ్

పుష్ప-2లో ఓ డైలాగ్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ‘ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్! ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అని అల్లుఅర్జున్ డైలాగ్ చెబుతాడు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డైలాగ్ సినిమాలో అవసరమా? అని చర్చించుకుంటున్నారు. మరి మీరేమంటారు..?

December 5, 2024 / 09:59 AM IST

సంధ్య థియేటర్‌పై కేసు నమోదు

TG: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప-2 మూవీని ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంవల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా, ఆమె కుమారుడు మరణించిన విషయం తెలిసిందే.

December 5, 2024 / 09:44 AM IST