‘పుష్ప 2’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ‘పుష్ప 2’ సినిమా తీశారని శ్రీశైలం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మార్పులు సూచించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది తెలిపారు. ఊహాజనిత ఆరోపణల ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని స్పష్టం చేసింది. కోర్టు సమయం ...
దసరాతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ నేను ఎదిగాను. మెగాస్టార్ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆ కల సాకారం కాబోతోంది’ అంట...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. కాగా, బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో పు...
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. తాజాగా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపింది. కాగా.. ఇటీవలే టైటిట్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఈ సినిమాను 2025 జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మూవీని 3డీ వెర్షన్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతానికి అన్ని థియేటర్స్‌లోనూ 2డీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. 3డీపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 3డీ వెర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే, ఆ షో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాలు...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప-2’. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ‘పుష్ప-2’ కి కొనసాగింపుగా ‘పుష్ప-3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన రసూల్ తన టీమ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోలో ‘పుష్ప-3: ది ర్యాంపేజ్’ అనే టైటిల్ కనిపించింది. దీ...
హీరోయిన్ శ్రద్ధా ఆర్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. గత నెల 29న తనకు ప్రసవం జరిగినట్లు తెలిపింది. కాగా, 2006లో ‘కలవనిన్ కదలై’ అనే తమిళ సినిమాతో శ్రద్ధా హీరోయిన్‌గా పరిచయం అయింది. తెలుగులో గొడవ, కోతిమూక, రోమియో సినిమాల్లో నటించింది. గతేడాది విడుదలైన హిందీ మూవీ ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ చిత్రంల...
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా సినిమా అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. కంగువా దెబ్బ నుంచి కోలుకున్న సూర్య.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూర్య 45వ సినిమా తెలుగులో ఫ్లాప్ అయిన వీర సినిమా స్టోరీని కాస్త అటు ఇటు మార్చి బాలాజీ సూర్య తెరకెక్కిస్తున్నారని చెప్పడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. స్టోరీలో భారీ మార్పులు చేస్తే తప్ప హిట్ అయ్యే అవకాశం ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా ఈనెల 5న విడుదల కానుంది. కాగా, తెలంగాణలో మూవీ విడుదలకు లైన్‌క్లియర్ అయ్యింది. బెనిఫిట్ షోకు రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషన్ వేయడంతో హైకోర్టులో విచారణ జరిపారు. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్...
మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్ తేజ్‌కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వరుణ్ తేజ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.
అల్లరి నరేష్, సుబ్బు మంగదేవి కాంబినేషన్‌లో వస్తున్న బచ్చల మల్లి డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే.. సీడెడ్ ఏరియాలో జేపీఆర్, ఉత్తరాంధ్రాలో SVC ఫిల్మ్స్, గుంటూరు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, నైజాంలో గ్లోబల్ సినిమాస్, కర్ణాటకలో బెంగళూరు కుమార్ ఫిల్మ్స్, చెన్నై మూవీస్, ఓవర్సీస్‌లో ప్రత్యాంగిరా సినిమాస్ ద్వారా వ...
సంక్రాంతి రేసు నుంచి ఒక్కో సినిమా తప్పుకుంటోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి లాంటి భారీ చిత్రాలు పండగకి వస్తుండటంతో కాంపిటీషన్ ఏర్పడింది. దీంతో పొంగల్‌కు విడుదల చేద్దామనుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకోగా తాజాగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా పొంగల్ దంగల్ నుంచి వైదొలిగాడు. విక్రమ్ యంగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌తో వీర ధీర సూరన్2ను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా అజిత్ విదాముర్చి ఎంట్ర...
పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పుష్ప తీయడానికి నా దగ్గరున్న సీన్స్ ఒకటో, రెండో అంతేనని, కానీ బన్నీ టాలెట్ చూసి నన్ను నమ్మి ప్రోత్సహించిన తీరు ఏదైనా చేయొచ్చు అనిపించిందన్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ను మూడేళ్లు కష్టపెట్టాను, ఇంకో మూడేళ్ల సమయం ఇస్తే మాత్రం పుష్ప 3 కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తానన్...
కాంతారా సినిమాతో సెన్షేషనల్ హిట్ అందుకున్న రిషభ్ శెట్టి మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి సందీప్ సింగ్ డైరెక్షన్‌లో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీ 2027లో విడుదల కానుంది.
దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్ సంపాదించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడిచింది. ఈ సినిమా 15 దేశాల్లో టాప్ 10 మూవీస్‌లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందని పేర్కొంది.