• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘ఆదిత్య 369’ సీక్వెల్‌‌పై బాలకృష్ణ కామెంట్స్

‘ఆదిత్య 369’ మూవీ సీక్వెల్‌ గురించి హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ‘ఆదిత్య 999’గా ఈ సినిమా రానుందని తెలిపారు. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారని ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని పేర్కొన్నారు. కాగా.. హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా మొదలు కాబోతున్న విషయం తెలిసిందే.

December 4, 2024 / 03:32 PM IST

మెగాస్టార్ లైనప్‌తో.. అభిమానుల్లో నయా జోష్

మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత వచ్చిన సినిమాలు అభిమానులకు సరిపోయేంత కిక్ ఇవ్వలేదు. అయితే తాజాగా చిరు చేస్తున్న వరుస ప్రాజెక్ట్‌లు మాత్రం అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించి ఊహించని బ్లాస్ట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే వెంటనే అనిల్ రావిపూడితో కూడా మరో మూవీకి ఓకే చెప్పాడు. ఈ రెండు నిర్ణయాలతో ఆనందంలో ఉన్న అభిమానులకు మరో వార్త వినిపిస్తోంది. సందీప్ వంగతో సినిమా ఖరార...

December 4, 2024 / 01:33 PM IST

రష్మిక కోసం వీడీ ఊహించని సాయం

రష్మిక నెక్స్ట్ సినిమా గర్ల్ ఫ్రెండ్ గురించి పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ ప్రస్తావించాడు. ఆ సినిమా టీజర్ చూశాడని, రష్మిక నటన వేరే లెవెల్‌లో ఉందంటూ పొగిడేశాడు. అయితే ఈ టీజర్‌లో మరో ప్రత్యేకత కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో రష్మిక పాత్రను పరిచయం చేయడం లాంటి సీన్స్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గర్ల్ ఫ్రెండ్ టీజర్‌ప...

December 4, 2024 / 01:10 PM IST

‘పుష్ప-2’ టికెట్లపై ఆర్జీవీ ట్వీట్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపుపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్నించాడు. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజ...

December 4, 2024 / 12:41 PM IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులతో కలిసి సినిమా వీక్షించనున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో సినిమా చూడనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

December 4, 2024 / 12:24 PM IST

‘ఆ సీన్స్‌లో ఇష్టం లేకుండానే నటించా’

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ మూవీని బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ పేరుతో రిమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రంపై షాహిద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అర్జున్ లాంటి అబ్బాయిలు నిజంగానే ఉన్నారని తెలిపాడు. అందుకే సందీప్ రెడ్డి ఆ సినిమా తీసినట్లు వెల్లడించాడు. అలాగే, ఆ సినిమాలో చా...

December 4, 2024 / 11:46 AM IST

అల్లు VS మెగా.. RGV ట్వీట్

ఇప్పటికే మెగా VS అల్లు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు RGV చేసిన ట్వీట్.. వాళ్ల ఫ్యాన్స్ మధ్య మరింత మంటపెట్టేలా ఉంది. ‘అల్లు.. మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లుఅర్జున్ ప్లానెట్ స్టార్’ అని ట్వీట్ చేశారు. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.. అని పేర్కొన్నారు. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇ...

December 4, 2024 / 11:41 AM IST

ఇవాళే చైతూ-శోభిత పెళ్లి

అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. ఇవాళ రాత్రి 8:13 గంటల ముహూర్తానికి ధూళిపాళ్ల శోభిత మెడలో 3 ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా విచ్చేయనున్నారు.

December 4, 2024 / 10:59 AM IST

ఆ చెయ్యి చిరంజీవిదే.. కానీ బ్రాస్‌లెట్స్ మావి: ఓదెల

మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నిన్న ప్రీ లుక్‌ను విడుదల చేశారు. అందులో రక్తంతో తడిచిన హీరో చెయ్యి కనిపిస్తుంది. దీనిపై ఓ నెటిజెన్ పెట్టిన పోస్ట్‌కు డైరెక్టర్ రిప్లై ఇచ్చాడు. పోస్టర్‌లో చూపించింది మన బాస్ చిరంజీవి చెయ్యే. బ్రాస్‌లెట్స్‌ మాత్రం తనది, నానిది. ఆ చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో అ...

December 4, 2024 / 09:47 AM IST

‘చనిపోయిన వారంతా బతికి వస్తారు’

‘మీర్జాపూర్’ సిరీస్ ఇప్పుడు సినిమాగా విడుదలవుతున్న నేపథ్యంలో నటుడు అలీ ఫజల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిరీస్ మూడు పార్టులలో చనిపోయినవారు ఈ సినిమాలో నడుచుకుంటూ వస్తారన్నారు. మళ్లీ వారంతా తెరపై కనిపిస్తారని పేర్కొన్నారు. సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందన్నారు. కాగా, క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు.

December 4, 2024 / 09:07 AM IST

తెలుగులో మరో ప్రాజెక్ట్ మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్..?

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే ఈ అమ్మడుని పుష్ప-2 స్పెషల్ సాంగ్‌ కోసం అనుకున్నారట. కానీ అధిక రెమ్యునరేషన్ అడగడంతో వెనక్కి తగ్గారట. తాజాగా నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని చూశారట. కానీ తన రెమ్యునరేషన్ చూసిన నిర్మాతలు వెనుదిరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

December 4, 2024 / 08:00 AM IST

థియేటర్లలో సందడి చేయనున్న పుష్పరాజ్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం ఇవాళ రాత్రి 9:30 గంటలకు బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. కాగా, విడుదలకి ముందే ‘పుష్ప2’ రికార్డుల వేట మొదలైంది. మంగళవారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్స్ రూపంలోనే రూ.100 కోట్లు వసూళ్ల మైలురాయిని అధిగమించింది.

December 4, 2024 / 07:19 AM IST

హాలీవుడ్‌లోకి ప్రముఖ కమెడియన్ ఎంట్రీ

ప్రముఖ కమెడియన్ యోగి బాబు అన్నీ ఇండస్ట్రీలలో తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. తాజాగా ఈ కమెడియన్ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హాలీవుడ్ మూవీ ‘ట్రాప్ సిటీ’లో ర్యాపర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. స్టెప్స్ వేస్తూ న్యూ లుక్స్‌లో కనిపించాడు. ఈ చిత్రానికి టెల్ కే గణేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

December 4, 2024 / 05:31 AM IST

డిసెంబర్ 04: టీవీలలో సినిమాలు

జీ తెలుగు: లక్ష్మీ (9AM), ఒరేయ్ బుజ్జిగా(11PM); ఈటీవీ: మహానగరంలో మాయగాడు (9AM); జెమినీ:నిజం (8.30AM), ఆకాశం నీ హద్దురా (3PM);స్టార్‌ మా: 24 (9AM);స్టార్ మా మూవీస్: చావు కబురు చల్లగా (7AM), కీడా కోలా (9AM), ఐ (11:30AM),ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (3PM), సర్కారు వారి పాట (6PM), F2 (9PM); జీ సినిమాలు: లక్ష్మీ రావే మా ఇంటికి (7AM), వసంతం (9AM), నువ్వులేక నేనులేను (12PM), లౌక్యం (3PM), ...

December 4, 2024 / 12:10 AM IST

చైతన్య-శోభిత వివాహం.. ఎవరెవరు వస్తున్నారంటే!

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో  వివాహం బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సహా చిత్ర పరిశ్రమకు చెందిన ముఖ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం.

December 3, 2024 / 11:17 PM IST