గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా పార్ట్ 2 ఉండబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాకుండా నెమ్మదిగా జరుగుతుండటంతో ఈ చర్చ మొదలైంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. దర్శకుడు శం...
‘కల్కి’ సినిమాలో ఓ పాత్రను రిజెక్ట్ చేశానని నటి కీర్తి సురేష్ చెప్పారు. ‘కల్కిలో ఓ పాత్ర కోసం నాగ్ అశ్విన్ నన్ను అడిగారు. కానీ ఆ పాత్ర నాకు నచ్చకపోవడంతో తిరస్కరించాను. ఈ సినిమాలో నన్ను భాగం చేస్తారని నేను నమ్మాను. బుజ్జి పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు. ఈ పాత్రకు మీ డబ్బింగ్ ప్లస్ అయిందని నాతో చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది’ అని పేర్కొన్నారు.
తాను రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ‘కల్కి’ మూవీకి ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నానని జోరుగా ప్రచారం చేశారని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏంటో నాకైతే అర్థం కాలేదని.. కథ, పాత్ర నచ్చితే పారితోషికం గురించి తాను పట్టించుకోనని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘వార్ 3’కి లీడ్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. ‘వార్ 3’లో కన్నడ స్టార్ యష్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ‘వార్ 2’కు అయ...
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘OG’. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నట్లు వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఓ పాత్ర ఉంటుందట. దాని కోసం ప్రభాస్‌ను సంప్రదించి కథ వినిపించగా.. అందుకు ఆయన ఓకే చెప్పారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్...
తమిళ హీరో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌ను నటి శ్రియా శరణ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను సూర్య మూవీలో స్పెషల్ సాంగ్ చేశాను. గోవాలో తెరకెక్కిన ఈ పాట అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. డిసెంబర్‌లో దీన్ని రిలీజ్...
జీ తెలుగు: గాలివాన (9AM), హనుమాన్ (12PM); ఈటీవీ: జోరు (10AM); జెమినీ: లియో (8.30AM), అరుంధతి (12PM), నాయక్ (3PM), సరైనోడు (6PM); స్టార్ మా: ఫ్యామిలీ స్టార్ (8AM), సలార్ (1PM), బలగం (4PM), టిల్లు స్క్వైర్ (6.30PM); స్టార్ మా మూవీస్: మళ్లీ పెళ్లి (7AM), పొర్ థోజిల్ (9AM), రాజుగారి గది 2 (12PM), హ్యాపీ డేస్ (3PM), భరత్ అనే నేను (6PM); జీ సినిమాలు: బ్రహ్మోత్సవం (7AM), సాక్ష్యం […]
మలయాళంలో ఇటీవల విడుదలైన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘బోగన్ విల్లియా’. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్, కుంచకో బోబన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం OTTలో మలయాళంతోపాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఈనెల 13న సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
నందమూరి అభిమానులకు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దీపావళి పండగ విషెస్ చెప్పారు. దీపావళి సందర్భంగా కుటుంబంతో కలిసి ఫొటో దిగారు. ఈ స్టిల్ పంచుకుంటూ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలపడంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ దీపావళి పండగ జరుపుకొన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. నవంబర్ 9న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
సినీ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా ఇవాళ విడుదలై మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై నిర్మాత శ్రీనివాస్ నాయుడు ట్వీట్ చేశారు. ‘ఫస్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉంది. చివరి 30 ననిమిషాలు మాత్రం అరుపులే. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ థ్రిల్లింగ్. మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరామెన్ పనితనం, క్వాలిటీ వేరే లెవల్’ అంటూ రాసుకొచ్చారు. తాజాగా దీనిపై స్పందించిన కిరణ్ అబ్బవ...
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆయన చూశారు. ఇక ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.
ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. పురాణాల నేపథ్యంలో వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి మేకర్స్ ‘చిరంజీవ’ అనే టైటిల్ పెట్టారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ షేర్ చేసింది.
శివకార్తీకేయన్ ‘అమరన్’ మూవీ భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఆయన జీవితాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి అద్భుతంగా తెరకెక్కించాడు. శివ కార్తీకేయన్ నటన, సాయిపల్లవి స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్స్. డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథనం నెమ్మదిగా సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్. రేటింగ్: 3.25/5.