ఈ ఇయర్ ఎండింగ్లో అంటే.. డిసెంబర్ 23న రిలీజ్ అయినా ధమాకా, 18 పేజెస్ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి థియేటర్లో వచ్చే వరకు.. ఈ సినిమాలే సందడి చేయనున్నాయి. అందుకే ఈ మధ్యలో మేమున్నాం అంటున్నారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి.. పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్గా తమ్ముడు, జల్సా సినిమాలు డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలు మంచి కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేశాయి. అందుకే మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్, మహేష్. దాంతో మళ్లీ ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘ఖుషి’ని డిసెంబర్ 31న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో పవన్ను చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక.. 2023 జనవరికి ఒక్కడు సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జనవరి 7న రీరిలీజ్ చేయబోతున్నారు. దాంతో ఒక్కడు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు ఈ ట్రైలర్ చూసి, వింటేజ్ మహేష్ అంటూ మురిసిపోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోను భూమికనే హీరోయిన్గా నటించడం విశేషం.