ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. అయితే కొరటాల శివతో చేయాల్సిన ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు కొరటాల. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ను వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్తో సలార్ సినిమా చేస్తున్నాడు నీల్. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దాంతో నెక్స్ట్ ఇయర్ మిడ్లో ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాను ఊహకందని విధంగా తెరకెక్కించబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో ఎన్టీఆర్ను డార్క్ మోడ్లో చూపించి.. ఇది ఊరమాస్ సబ్జెక్ట్ అనే హింట్ ఇచ్చేశాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందట. అందుకోసం మరో స్టార్ హీరోని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. అది కూడా అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ బడా స్టార్ నీల్ మైండ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిజంగానే అమీర్ ఖాన్ను సంప్రదిస్తారా.. లేదంటే మరో హీరోని ట్రై చేస్తారా.. అనేది తెలయాల్సి ఉంది. ఒకవేళ అమీర్ ఖాన్ ఓకే చెబితే మాత్రం.. ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి విషయాల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.