శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ఆ తర్వాత సుందరంగా మెప్పించలేకపోయాడు. అయితే అంటే సుందరానికి సినిమా తర్వాత హిట్2 తో నిర్మాతగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు హిట్3 ఫ్రాంచైజ్‌లో తానే హీరో అని చెప్పేశాడు. ఇక హిట్ 2 తర్వాత ఊరమాస్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్లో దసరా అనే సినిమా చేస్తున్నాడు. నాని కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది దసరా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన దోస్తాన్ సాంగ్.. సినిమా ఎంత మాస్‌గా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో.. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. వచ్చే సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాంతో దసరా ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు నాని. న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా ‘నాని 30’ ప్రకటించిన నాని.. తాజాగా తన అభిమానులతో ఫోటో సెషన్ ఏర్పాడు చేశాడు. ఈ ఫ్యాన్ మీట్ యూసఫ్ గూడలోని గ్రాండ్ గార్డెన్స్‌లో జరిగింది. దీనికి నాని ఫ్యాన్స్ క్యు కట్టారు. అయితే ఈ ఫోటో సెషన్లో ‘దసరా’ గెటప్‌లోనే వచ్చాడు నాని. దాంతో ఇది దసరా సినిమా ప్రమోషన్సే అని చెప్పొచ్చు. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకే నాని ఫ్యాన్స్ మీట్‌తో ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు కాస్త సాఫ్ట్‌గానే కనిపించిన నాని.. దసరాతో మాస్ ఆడియెన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.