Keerthy Suresh: పెళ్లైనా హీరోతో కీర్తి సురేష్ లిప్ లాక్?
మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మను ఎలా అయితే చూడకూడదు అనుకున్నారో.. ఇప్పుడు అలాగే కనిపించడానికి రెడీ అవుతోంది అమ్మడు. ఏకంగా పెళ్లైనా హీరోతో లిప్ లాక్ సీన్‌కు సై అన్నట్టుగా తెలుస్తోంది.
Keerthy Suresh: నిన్న మొన్నటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో ఉన్న కీర్తి.. ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోంది. క్యూట్ బ్యూటీ, హోమ్లీ బ్యూటీ అనే పదాలకు చెక్ పెడుతూ.. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ హాట్ బ్యూటీగా మారిపోయింది కీర్తి సురేష్. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతోనే యూటర్న్ తీసుకుంది కీర్తి. అక్కడి నుంచి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. అయితే.. కీర్తిలోని అసలైన గ్లామర్ ట్రీట్ చూసే సినిమా మాత్రం రాలేదు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. ఇప్పటి వరకు పెద్దగా హద్దులు దాటని ఈ బ్యూటీ.. బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. కాలీస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మే 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి గ్లామర్ ట్రీట్ కాస్త గట్టిగానే ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. బోల్డ్ లిప్‌లాక్ సీన్లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదే నిజమైతే.. బాలీవుడ్ కోసం కీర్తి తన రూట్‌ని పూర్తిగా మార్చుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు కీర్తి లిప్ లాక్ సీన్లు చేయలేదు. కానీ వరుణ్ ధావన్‌తో కలిసి ఘాటుగా అదర చుంబనం చేయనుందనే న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరుణ్ ధావన్‌కు పెళ్లైంది. దీంతో.. పెళ్లైనా హీరోతో కీర్తి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇదే కాదు.. ఓ పాటలో కీర్తి మరింత బోల్డ్‌గా కనిపించనుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇక నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసిందనే చెప్పాలి. బేబీ జాన్ హిట్ అయితే.. కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా.