Nagarjuna Tabu who is going to meet after all these years.
సినిమా పరిశ్రమలో కొంతమంది కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పటికి ఫెవరెట్ గా నిలిచిపోతుంటాయి. అలాంటి జంటల్లో నాగార్జున(Nagarjuna), టబు(Tabu) పెయిర్ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఇద్దరు కలిసి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాగ్ తో కలిసి టబు ఆవిడా మా ఆవిడే(Avida maa avide), నిన్నేపెళ్లాడతా(ninne pelladutha) అనే మూవీస్ చేసిన విషయం తెలిసిందే. చేసిన రెండు సినిమాలు నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచాయి. అంతే కాకుండా నాగార్జున నటించిన సిసింద్రీ(sisindri) సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ టబు. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే హాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం టబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తోంది. ఇటీవలే అల్లు అర్జున్() నటించిన అల వైకుంఠపురంలో సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరోసారి ఆమె కింగ్ నాగార్జున(Nagarjuna)తో కలిసి నటించనుందని తెలుస్తోంది. కింగ్ నాగార్జున ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి(Ajay bhupathi)తో కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ కు జోడీగా టబు నటిస్తున్నారని ఇండస్ట్రి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోసారి ఈ రొమాంటిక్ పెయిర్ ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. అజయ్ భూపతి ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తో కలిసి మంగళవారం అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ తో సినిమా చేయనున్నాడని వినికిడి. ఇప్పటికే కథను నాగార్జునకు వినిపించాడట. కథ నచ్చడంతో నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక సినిమాలో టబు హీరోయిన్ గా తీసుకుంటున్నారా లేదా ఏదైన స్పెషల్ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారా అన్న విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం నాగార్జున బెజవాడ ప్రసన్న దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.