వీరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి తగ్గేదేలే అంటున్నారు. ‘వీరసింహారెడ్డి’ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ‘వాల్తేరు వీరయ్య’ను యంగ్ డైరెక్టర్ బాబీ ఊరమాస్ సినిమాలుగా తెరకెక్కస్తున్నారు. జనవరి 12న బాలయ్య ఆడియెన్స్ ముందుకు వస్తుండగా.. జనవరి 13న మెగాస్టార్ వస్తున్నారు. దాంతో ఈ సినిమాల పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అలాగే చిరు, బాలయ్య మధ్య వార్ పెరిగిపోతునే ఉంది. ఇప్పటికే సాంగ్స్ విషయంలో వీరసంహా రెడ్డి, వాల్తేరు వీరయ్య నువ్వా నేనా అంటున్నారు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు.. కాబట్టి తక్కువ గ్యాప్‌లో పోటా పోటీగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయబోతున్నారు. ఇప్పటివరకు తమన్ ఇచ్చిన వీరసింహారెడ్డి ట్యూన్స్.. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలకు మంచి స్పందన వచ్చింది. దాంతో ఇప్పుడు మాస్ మొగుడు అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 3న రాత్రి 07గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక వాల్తేరు వీరయ్య నుంచి కూడా మరో అదిరిపోయే సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల దేవిశ్రీ అందిచిన వీరయ్య టైటిల్ ట్రాక్.. పూనకాలు లోడింగ్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతున్నాయి. దాంతో త్వరలోనే ‘నీకేమో అందం ఎక్కువ.. నాకేమో తొందరెక్కువ.. అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన బిటీఎస్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరి ఈసారి మెగాస్టార్, బాలయ్య ఎలా అలరిస్తారో చూడాలి.