AP: పోలవరం ఆర్డీపురంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో సమీప గ్రామల ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. పులిని బంధించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డ్రోన్లు, ట్రాకర్ సాయంతో పులి కదలికలను అధికారులు పరిశీలిస్తున్నారు. పులికొండ సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు.