VZM: కొత్తవలస మండలం పాత కొత్తవలసలో కలకలం రేపిన మృత దేహాన్ని ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన అల్లు కిషోర్ (39)గా బంధువులు గుర్తించారు. వారి సమాచారం మేరకు ఈనెల 8న స్థానిక ఒడ్డిపేటలో ఓ ఫంక్షన్‌కి వచ్చి కనిపించలేదని మృతుని తండ్రి సత్యరావు తెలిపాడు. ఇవాళ ఉదయం మృతుని తమ్ముడు కోటి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.