ASR: పాడేరులోని ముఠా కళాశీల కూలిరేట్లు పెంపుపై శనివారం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టీ.సూర్యనారయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి సుందరరావు తెలిపారు. సిమెంట్, ఐరన్ వర్తకుల సంఘం, ముఠా కళాశీల కార్మిక సంఘం మధ్య ఒప్పందం జరిగిందన్నారు. గతంలో కంటే 20శాతం కూలిరేట్లు పెంచడం జరిగిందన్నారు.