అన్ని ఇండస్ట్రీలలో తరచుగా వినిపించే మాట కాస్టింగ్ కౌచ్. ఎక్కడో ఓ చోట హీరోయిన్లు దీని గురించి చెబుతునే ఉన్నారు. సీనియర్ హీరోయిన్లు మొదలుకొని యంగ్ హీరోయిన్లంతా ఏదో ఓ చోట కాస్టింగ్ కౌచ్ బారిని పడిన వారేనని.. పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే తాజాగా ఈ జనరేషన్ హీరోయిన్లపై సీనియర్ హీరోయిన్ జయప్రద చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాస్టింగ్ కౌచ్ విషయంలో ‘మీటూ’ అంటూ ఒక ఉద్యమం కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఈ ధైర్యంతో చాలా మంది హీరోయిన్లు పబ్లిక్‌గానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్లు సైతం కాస్టింగ్ కౌచ్‌కి గురించి తమకు ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. అయితే ఈ జనరేషన్ హీరోయిన్లు మాత్రం అడగకముందే.. పడక ఎక్కడానికి రెడీ అవుతున్నారని.. సీనియర్ హీరో జయప్రద సంచలన కామెంట్స్ చేసింది.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ముంబై నుంచి వచ్చే హీరోయిల్లు దర్శకులు, నిర్మాతలు అడగకముందే కమిట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇలా చేయకపోతే ఆఫర్లు రావని నమ్ముతున్నారు వాళ్లు. కానీ అప్‌కమింగ్ హీరోయిన్ల ఆలోచన విధానం మారాలి. టాలెంట్ ఉంటే కొంచెం లేట్ అయినా.. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అదే నమ్మకంతో పని చేయాలి కానీ, మేకర్స్‌కు కమిట్మెంట్స్ ఇస్తేనే అవకాశాలు వస్తాయనే ఆలోచన ఉండకూడదని చెప్పుకొచ్చింది.
అలాగే ఇండస్ట్రీలో ఈ ధోరణి పోవాలి.. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రావాలి. అయితే అది అంత త్వరగా, ఈజీగా జరిగే వ్యవహారం కాదని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ రాణించిన జయప్రద.. మా రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అనేది అసలు లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఈ రోజుల్లో అలా జరగడం లేదు.. అవకాశాల కోసం దర్శక, నిర్మాతలకు అడిగింది చేస్తున్నారని చెప్పింది. దీంతో ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.