»Emraan Hashmi Set To Make South Cinema Debut With Pawan Kalyan Starrer Og
Pawan: సినిమాలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ నటుడు..!
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ నటిస్తున్నOG మూవీలో చేరారు. ఈ చిత్రంతో ఇమ్రాన్ తన సౌత్ సినిమా అరంగేట్రం చేయనున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఇమ్రాన్ విలన్గా నటించనున్నారు.
సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) నటిస్తున్న చిత్రం ‘ఓజీ(OG)’. తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసిపోయింది. బాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లకు పెట్టింది పేరైన ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’లో విలన్ గా నటించనున్నాడు. ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా శక్తిమంతుడైన దుష్టపాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది.
ఇమ్రాన్ హష్మి… ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ కు బద్ధశత్రువు ఇతడే అని వివరించింది. ఈ మేరకు ‘ఓజీ(OG)’లో ఇమ్రాన్ హష్మీ లుక్ ను కూడా పంచుకుంది. కాగా, ఈ చిత్రంలో నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఓజీలో కీలక పాత్రల్లో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి నటిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇమ్రాన్ హష్మీకి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉండే ఇమ్రాన్ హష్మీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు ఆయనను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేయడం మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.