»Trailer Of Maya Petika Offers Entertaining Thriller
Maya Petika: పాయల్ మాయాపేటిక ట్రైలర్ అదిరింది..!
స్మార్ట్‌ఫోన్ సెంట్రిక్ థ్రిల్లర్ మాయ పెటికా మూవీ ట్రైలర్ విడుదలైంది. జూన్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ వంటి స్టార్ స్టడెడ్ బృందం యాక్ట్ చేశారు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఆ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ ని ఆకర్షించింది. ఆమధ్య ఆమెకు కాస్త ఆఫర్లు తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా, ఆమె ప్రధాన పాత్రలో మాయాపేటిక అనే సినిమా వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ప్రస్తుత జీవితంలో స్మార్ట్ ఫోన్ లేనివారు అంటూ ఎవరు లేరు. ఆ స్మార్ట్ మనుషుల జీవితాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తోంది. అసలు దానివలన కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ప్రేమ, అధికారం, డబ్బు వీటితో పాటు మనిషికి తప్పని నాలుగో అవసరంలా సెల్ ఫోన్ మారిందని ట్రైలర్ లో ఫోన్ మాట్లాడుతూ చెప్పడం ఆకట్టుకొంటుంది. నాలుగు కథల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అని చూపించారు. వారందరికి ఈ ఫోన్ కు ఉన్న కనెక్షన్ ఏంటి.. ? అనేది సస్పెన్స్ గా కనిపిస్తుంది. ఇందులో పాయల్.. హీరోయిన్ గానే కనిపిస్తుండగా.. విరాజ్.. ముస్లీమ్ మెకానిక్ గా కనిపించాడు. ఇక సునీల్.. ఆటో డ్రైవర్ లా కనిపించగా.. శ్రీనివాసరావు కోతులను ఆడించేవాడిగా చూపించారు. ఈ నలుగురు కథల్లో స్మార్ట్ ఫోన్ ఎలాంటి పాత్ర పోషించింది. చివరికి ఆ నాలుగు కుటుంబాలు ఏమయ్యాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమాతో పాయల్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.