Adipurush movie review: ఆదిపురుష్ మూవీ రివ్యూ..ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్!
ప్రభాస్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ ఈరోజు(జూన్ 16న) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆదిపురుష్ ట్రైలర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. రామాయాణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది ? హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు చుద్దాం.
సినిమా పేరు: ఆదిపురుష్ తారాగణం: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, తదితరులు బ్యానర్లు: T సిరీస్ & UV క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ, ప్రమోద్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ దర్శకుడు: ఓం రౌత్ ఆడియో: T సిరీస్ సంగీత దర్శకుడు: అజయ్-అతుల్ రన్ టైమ్: 2 గంటలు 59 నిమిషాలు విడుదల తేదీ: జూన్ 16, 2023
ఆదిపురుష్ సినిమా రిలీజ్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నేడు(జూన్ 16న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రామాయణం(Ramayan) ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) డైరెక్షన్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(kriti sanon) సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు సినిమాలో కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఈ చిత్రంపై మరింత బజ్ ను పెంచేసింది. ఈ క్రమంలో అసలు మూవీ బాగుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
ఆదిపురుష్ స్టోరీ దాదాపు అనేక మందికి తెలిసిన కథనే. రామాయణంలోని అరణ్యకాండం నేపథ్యంలో కొనసాగుతుంది. అక్కడ సీతను రావణుడు అపహరిస్తాడు. ఆ క్రమంలో తెలుసుకున్న రాముడు సీత కోసం రావణుడిపై ఎటాక్ చేస్తాడు. ఆ క్రమంలో రాముడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? మరోవైపు అపహరణకు గురైన సీత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అందుకోసం రాముడికి హనుమంతుడు ఎలా సాయం చేశాడు? రావణుడికి అనేక పేర్లు ఎందుకు వచ్చాయి? అసలు చివరికి ఏం జరిగింది? అయితే చివరకు రాముడు సీతను తీసుకొచ్చాడా లేదా అనేది స్టోరీ.
ఎలా ఉందంటే
జానకి (కృతి సనన్), రాఘవ (ప్రభాస్)తో వనవాసం చేస్తున్న సమయంలో లంకేష్ (సైఫ్ అలీఖాన్) ఆమెను అపహరించబడినప్పుడు ఏమి జరుగుతుంది అనేది సినిమా స్టోరీ. చెడుపై మంచి సాధించిన విజయం కథకు రామాయణానికి సంబంధించిన పురాణ కథను ఎంచుకున్నాడు. అయితే కథ అందరికీ తెలిసిందే. ఫస్టాఫ్ లో కీలక పాత్రలను చూపిస్తారు. సెట్టింగ్స్ విజువల్ క్లాసిక్స్ ఆకట్టుకుంటాయి. అనేక సీన్లు ఊహించదగినవిగా ఉంటాయి. ఇక సెకండాఫ్ పూర్తిగా వేరే జోన్లో ఉంటుంది. హీరో (రాఘవ), విలన్ (లంకేష్) పాత్రలు సహజంగానే వైరుధ్యంగా మారతాయి. దీంతోపాటు VFXతో కూడిన క్లైమాక్స్‌కి దారి తీస్తుంది. వీటన్నింటి మధ్య నిజమైన భావోద్వేగాలు పెద్దగా కనిపించవు. సెకండాఫ్ కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. చివరగా సీత, రాముడు కలుసుకున్నప్పుడు ఎటువంటి భావోద్వేగ సంబంధం ఉండదు. కానీ సీత మెడను విలన్ కట్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది.
ఎవరెలా చేశారు
ఒక స్టార్‌గా ప్రభాస్‌కి రాముడుగా యాక్ట్ చేసి ఔరా అనిపించుకున్నారు. అతని కళ్ళలో అంతర్లీనంగా అమాయకత్వం, ప్రశాంతత కనిపిస్తాయి. అతని లుక్స్ ఒక యోధుడిలా కనిపిస్తాయి. అనేక సానుకూల అంశాలు ఉన్నప్పటికీ నిజంగా మంచి మార్కులు కొట్టే సీన్స్ అయితే లేవని చెప్పవచ్చు. ఒక్కోసారి ప్రభాస్ బిగుసుకుపోయి ప్లాస్టిక్ వైబ్ మాదిరిగా కనిపిస్తారు. సీత పాత్రలో కృతి సనన్ చాలా తక్కువగానే నటించింది. ఆమెకు తక్కువ స్క్రీన్ సమయం ఉంది. కృతి సనన్ పురాణ పాత్రను పోషించడంలో తన ముద్ర వేయలేకపోయిందనే చెప్పవచ్చు. చివరగా సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రను పోషించాడు. ఈ క్యారెక్టర్ పెద్దగా ఆసక్తిగా అనిపించదు. అతని చేష్టలు చికాకు కలిగిస్తాయి. క్లాసిక్ రామాయణం గురించి ఆలోచిస్తే అతని చర్యలు విభిన్నంగా ఉంటాయి. ఇక మిగతా నటీనటులు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల తీరు
ఈ చిత్రంలో రెండు సినిమాల పాత స్టోరీలను ఓం రౌత్ ఆదిపురుష్‌గా తెరకెక్కించాడు. ఓం రౌత్ చెడుపై మంచి సాధించిన విజయంగా రామాయణం స్టోరీని కథను ఎంచుకున్నాడు. కానీ ఆసక్తిగా చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. అజయ్-అతుల్, సచేత్-పరంపర (రామ్ సీతా రామ్) ఆదిపురుష్ సంగీతాన్ని అందించారు. జై శ్రీ రామ్ ట్రాక్ సహా పలు చోట్ల మ్యాజిక్ పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్లు బాగున్నాయి. అయితే వాటిని సెటప్ చేయడంలో కొంత తడబడినట్లు అనిపిస్తుంది. నిడివి, ముగింపు విషయంలో ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఇక VFX చాలా అధ్వానంగా ఉందని చెప్పవచ్చు. అనేక చోట్ల కార్టూన్ల మాదిరిగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్
+ప్రభాస్ ఎంట్రీ
+ఫస్ట్ హాఫ్
+బీజీఎం
మైనస్ పాయింట్స్
-రన్‌టైమ్ ఎక్కువ
-తగ్గిన ఎమోషన్
-పనికిమాలిన VFX
-రావణుడి తీరు
-ఊహించదగిన సీన్స్