వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య వసూళ్ల హవా కాస్త ఎక్కువగా ఉంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో ఎంటరైన వీరయ్య.. ఓవర్సీస్లో దుమ్ముదులుపుతున్నాడు. అక్కడ 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ అవడమే కాదు.. లాభాల దిశగా దూసుకు పోతున్నాడు. దాంతో వీరయ్య చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్లో ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ బాబీని ఆకాశానికెత్తుస్తున్నారు. చెప్పినట్టుగానే వింటేజ్ మెగాస్టార్‌ను చూపించి.. పూనకాలు తెప్పించాడు. దాంతో బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి.. హీరో ఎవరు.. అనే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. బాలయ్యతో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. గతంలోనే ఈ కాంబినేషన్ పై వార్తలొచ్చినా.. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టడంతో.. బాబీతో బాలయ్య సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలయ్య లైనప్ భారీగా ఉంది. 108వ సినిమా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ఆ తర్వాత సర్కారు వారి పాట దర్శకుడు పరుశురాం లైన్లో ఉన్నాడు. అలాగే బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ కూడా ఉంది. ఇవే కాదు.. మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కూడా బాలయ్య ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. దాంతో బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలయ్యతో ఉంటుందా.. లేదంటే, ఈలోపు మరో సినిమా చేస్తాడా.. అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే