»Devara 80 Percent Complete Ott Partner Fixed Kalyan Ram
‘దేవర’ 80 శాతం కంప్లీట్, ఓటిటి పార్ట్నర్ ఫిక్స్.. కళ్యాణ్ రామ్
ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీంతో తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.
ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ డైరెక్ట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కెరీర్లో ఫస్ట్ టైం ఆచార్య వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫేజ్ చేసిన కొరటాల.. దేవర స్క్రిప్టు కోసం చాలా సమయం తీసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత.. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో సమ్మర్లో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ షురూ చేసిన కొరటాల.. ఏ మాత్రం బ్రేక్ లేకుండా జెట్ స్పీడ్‌లో దూసుకుపోయాడు. ముందుగా గ్రాఫిక్స్ వర్క్ కోసం హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశాడు. ఆ తర్వాత టాకీ పార్ట్ మొదలు పెట్టాడు. ఏప్రిల్ 5 రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేసిన దేవర.. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఎంతవరకు షూట్ అయిందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘డెవిల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇప్పటివరకు దేవర షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. అలాగే.. దేవర ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ ఇస్తుందని.. ఓ సీన్ కోసం భారీ సంప్ తవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే.. సెకండ్ పార్ట్‌ను మాత్రం టచ్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. ముందు దేవర పార్ట్ 1 పూర్తి కావాలని అన్నారు. ఈ క్రమంలో దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని కూడా చెప్పేశాడు. నెట్ ఫ్లిక్స్ సీఇవో ‘టెడ్ సరాండోస్’తో మా చివరి మీటింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఎలా ప్రారంభమైంది? ప్రపంచవ్యాప్తంగా ఎలా అభివృద్ధి చెందుతోందనే అంశం మీద చర్చించామని అన్నారు. ఇక.. దేవర షూటింగ్ చివర దశకు చేరుకుంది కాబట్టి.. జనవరి ఫస్ట్ వీక్‌లో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మరి భారీ అంచనాలున్న దేవర ఎలా ఉంటుందో చూడాలి.