Payal Ghosh: ‘సలార్’ ఒక చెత్త సినిమా..నటి షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలు అంతగా బాలేవని, ఈ సినిమాలు జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయంటూ నటి పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్ ‘ప్రయాణం’ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ తర్వాత ఆమె ఎన్టీఆర్ తో ఊసర వెల్లి సినిమాలో కనిపించింది. కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించిన తర్వాత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే అప్పుడప్పుడూ ఈ హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్ అవ్వడంలో ఈమె ఆరితేరింది.
తాజాగా పాయల్ ఘోష్ సలార్ గురించి చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. 2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయని, ఒక్కటీ కూడా చూడలేదనే విధంగా చెప్పింది. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే అయినా సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయని, ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ అని, ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని ట్వీట్ చేసింది.
ఈ ఏడాది బాలీవుడ్లో భారీ కలెక్షన్లు సాధించిన పఠాన్, జవాన్, యానిమల్ సినిమాలు అంతగా బాలేవని పాయల్ చెప్పుకొచ్చింది. అన్నీ జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పాయల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్తల్లో నిలిచి ఫేమస్ అయ్యేందుకే ఇలాంటి పనికిమాలిన కామెంట్స్ చేస్తుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట విరుచుకుపడుతున్నారు.