Chiranjeevi: చిరు నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ ఫిక్స్!
ఇంకొన్ని గంటల్లో మెగాస్టార్ చిరు నటిస్తున్న 'భోళా శంకర్' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అలాగే రీసెంట్గా వాల్తేరు వీరయ్య 200 డేస్ వేడుకలో తన తదుపరి రెండు సినిమాలను కన్ఫమ్ చేశారు చిరు.
Megafans in confusion.. Three star directors for Chiru?
రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఒకేసారి మూడు నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఆచార్య, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఈ సినిమాలన్నీ ఓకేసారి షూటింగ్ జరుపుకున్నాయి. ఆచార్య ఫ్లాప్ అవగా.. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచింది. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత భోళా శంకర్‌గా వస్తున్నాడు మెగాస్టార్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లేదుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్ట్ లాక్ అయింది. ఆగష్టు 22న చిరు బర్త్ డే కానుకగా ఈ ప్రాజెక్ట్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ, వెంకీ కుడుముల లైన్లో ఉన్నారు. వీరిలో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు టాక్. ప్రజెంట్ నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు వెంకీ. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరు మాట్లాడుతూ.. రవితేజ గురించి చెబుతూ తన కూడా స్పీడ్ పెంచుతానని చెప్పాడు.
ఈ మధ్య రవితేజ తనతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తన నుంచి ఐదు సినిమాల రిలీజ్లు ఉంటాయని చెప్పాడని.. తాను కూడా అతని నుంచి ఇన్స్పైర్ అయి వేగంగా సినిమాలు చేస్తున్నానని.. వచ్చే ఏడాది కనీసం తన నుంచి రెండు రిలీజ్లు ఉంటాయని చెప్పాడు చిరు. అందులో ఒకటి తన కూతురు సుశ్మిత నిర్మాణంలో చేస్తున్నాని.. మరోటి యువి క్రియేషన్స్ సంస్థలో ఉంటుందని అన్నాడు. అయితే యూవీ బ్యానర్ డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికైతే వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఈ బ్యానర్లోనే ఉండాల్సింది. మరి ఇప్పుడు ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.