»Happy Birthday Mahesh Babu And His Properties Nad Biography
Mahesh babu: హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు..తన ఆస్తులు ఏంతంటే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే ఈరోజు(ఆగస్టు 9). 48వ ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. సుమారు 20 ఏళ్లకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఈ స్టార్ హీరో బయోగ్రఫీ, ఆస్తుల(property) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
happy birthday mahesh babu and his properties nad biography
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు(mahesh babu) ఈరోజు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ యాక్ట్ చేస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది చూసిన అభిమానులు అదిరిపోయిందని అంటున్నారు. ఈ పోస్టర్లో మహేష్ ఓ వైపు మాస్, మరోవైపు క్లాస్ రెండింటీని మిక్స్ చేసినట్లుగా కనిపిస్తున్నాడు. లుంగీ కట్టుకుని, గళ్ల చొక్కాతో సన్ గ్లాసెస్ పెట్టుకుని..షర్ట్ పై బటన్ విప్పేసి క్రేజీగా కనిపిస్తున్నారు. అంతేకాదు సిగరెట్ వెలిగిస్తున్న స్టైల్ కూడా సూపర్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్(trivikram) దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న మూడో చిత్రం ఇది కావడం విశేషం. SSMB28 జనవరి 12, 2024న థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ ఈ పోస్టర్లో స్పష్టం చేశారు. అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా తన ఆస్తుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు 1975లో నటుడు కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు చెన్నై(chennai)లో జన్మించారు. అతను చెన్నైలోని సెయింట్ బేడేస్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను లయోలా కాలేజీ నుంచి కామర్స్‌లో ఆనర్స్ డిగ్రీని పొందాడు. చదువుకునేటప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. 1999లో రాజకుమారుడులో ప్రీతి జింటాతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో యాక్ట్ చేశాడు. 2005లో సినీ నటి నమ్రతా సిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు. మహేష్‌కి ఇద్దరు పిల్లలు, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఉన్నారు. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత నమ్రత, మహేష్ పెళ్లి చేసుకున్నారు.
మహేష్ బాబు 2 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమ(tollywood industry)లో టాప్ హీరోల్లో ఒకరిగా స్థిరపడ్డారు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. సినిమాల్లో యాక్ట్ చేయడమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాలను దత్తతకు తీసుకున్నారు. దీంతోపాటు పిల్లలకు గుండె శస్త్రచికిత్సలకు సహాయం చేయడం సహా పలు దాతృత్వ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
అయితే మహేష్ బాబు నికర ఆస్తుల విలువ(property) 33 మిలియన్ డాలర్లు (రూ.256 కోట్లు) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నటుడి సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా వస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. దాని విలువ సుమారు రూ.28 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు ఇటీవల బెంగళూరులో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దీంతోపాటు హైదరాబాద్ AMB సినిమాస్ హై ఎండ్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యం ఉంది. ఇది 2021లో స్థాపించబడింది. మరోవైపు AN రెస్టారెంట్‌ను కూడా కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ హీరో మైంత్రాతో కలిసి తన సొంత దుస్తుల లైన్ “ది హంబుల్ కో”తో టెక్స్టైల్ పరిశ్రమలోకి కూడా ప్రవేశించాడు. ఇది కాకుండా, నటుడికి రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.