Sudhir Babu : ‘మామా మశ్చీంద్ర’ నుంచి మరో లుక్.. అదిరిందిగా!
Sudhir Babu : ప్రస్తుతం యంగ్ హీరో సుదీర్ బాబును గుర్తుపట్టడం కాస్త కష్టమే. మొన్ననే లడ్డుబాబుగా మేకోవర్ అయి షాక్ ఇచ్చిన సుధీర్.. ఇప్పుడు మరో కొత్త లుక్‌తో అదరగొట్టేశాడు. ఇటీవల వచ్చిన అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ క్రమంలో సరికొత్తగా మేకోవర్ అయి.. మూడు పాత్రలతో నెటిజన్స్‌కు షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం యంగ్ హీరో సుదీర్ బాబును గుర్తుపట్టడం కాస్త కష్టమే. మొన్ననే లడ్డుబాబుగా మేకోవర్ అయి షాక్ ఇచ్చిన సుధీర్.. ఇప్పుడు మరో కొత్త లుక్‌తో అదరగొట్టేశాడు. ఇటీవల వచ్చిన అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ క్రమంలో సరికొత్తగా మేకోవర్ అయి.. మూడు పాత్రలతో నెటిజన్స్‌కు షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సుధీర్ బాబు కూడా అలాగే చేస్తున్నాడు. చాలా కాలంగా మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు.. ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నాడు. తశ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టైటిల్‌తోనే ఈ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మేకర్స్.. సుధీర్ బాబు ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ.. అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు దుర్గా, డీజే, పరశురాం అనే.. మూడు పాత్రలో నటిస్తున్నాడని చెప్పేశారు. వాటిలో దుర్గ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా వైరల్‌గా మారింది. అ లుక్‌లో లడ్డుబాబుగా కనిపించాడు సుధీర్. అయితే ఇప్పుడు పరశురామ్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ లుక్ చూస్తే.. ఔరా అనాల్సిందే. ఈ పాత్రలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నాడు సుధీర్. మిడిల్ ఏజ్ వ్యక్తిగా, గ్యాంగ్ స్టర్ గెటప్‌లో సూపర్ స్టైలిష్‌గా ఉన్నాడు. ఈ లుక్‌లో కూడా సుధీర్‌ను గుర్తు పట్టడం కష్టమే. దాంతో నెక్స్ట్ వచ్చే డీజే లుక్ ఇంకెలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మామా మశ్చీంద్ర కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు సుధీర్ బాబు. మరి ఈ సినిమా అయినా సుధీర్‌కు సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.