బుట్టబొమ్మకు ఆఫర్లు వస్తున్నా.. సరైన హిట్ మాత్రం పడడం లేదు. ఈ ఏడాదిలో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది అమ్మడు. 2022లో పూజా నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు అమ్మడిని నిరాశ పరిచాయి. అయితే హ్యాట్రిక్ ఫ్లాపులే అనుకుంటే.. పూరీ జగన్నాథ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఎఫ్3లో ఓ ఐటెం సాంగ్ చేసిన సోసోగానే నిలిచింది. అయితే ఈ ఇయర్ ఎండింగ్లోనైనా ఓ హిట్ అందుకోవాలని చూసింది. కానీ ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే కలిసి నటించిన ‘సర్కస్’ మూవీ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ రివ్యూస్ రావడమే కాక బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ హిందీ వెర్షన్ కంటే చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు.. 2022లో మరో చెత్త మూవీని రణ్వీర్, రోహిత్ శెట్టిలు అందించారంటూ.. బాలీవుడ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. దాంతో పాపం పూజా పరిస్థితి ఇలా అయిందేంటి.. అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అంతేకాదు.. గతంలో లాగే మళ్ళీ ఐరన్ లెగ్గా మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అప్ కమింగ్ ఫిల్మ్స్.. SSMB28, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అయినా అమ్మడికి హిట్స్ ఇస్తాయేమో చూడాలి.