ఈ టీవిలో మల్లెమాల అందిస్తున్న ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మంది యాంకర్లు పరిచయమయ్యారు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి లాంటి వారు ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగ వర్షిణి తనను ఓ డైరెక్టర్ ఆడిషన్‌కి పిలిచి అలా చేశాడంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
అనసూయ సినిమాలు చేస్తోంది.. రష్మీ గౌతమ్ కూడా హీరోయిన్గా చేసింది.. విష్ణు ప్రియ కూడా సినిమాలు, ఓటిటిల బాట పట్టింది.. ఇదే దారిలో మరో యాంకర్ వర్షిణి కూడా సినిమాల్లో ఆఫర్లు అందుకుంటోంది. మొదట్లో పటాస్ షో ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన వర్షిణి, ఆ తర్వాత పలు బుల్లి తెర షోలతో అలరించింది. ఢీ షోలో కూడా అమ్మడు హల్చల్ చేసింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు పట్టేసింది. ప్రస్తుతం అమ్మడి టార్గెట్ బిగ్ స్క్రీన్‌గా దూసుకుపోతోంది. కానీ తను ఇలాంటి పొజిషన్‌కు రావడానికి అందరి లాగే కాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని చెప్పింది వర్షిణి.
‘లాక్ డౌన్‌కి ముందు ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఓ డైరెక్టర్ నుండి పిలుపు వచ్చింది. దాంతో ఆడిషన్స్ కోసం వెళ్ళాను. ఒక స్టార్ హోటల్లో ఆ డైరెక్టర్ని కలిసాను. అయితే ఆడిషన్ ఇచ్చే లోపే.. అతని నిజ స్వరూపం బయట పెట్టాడు. ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని బెడ్ పైకి లాగేశాడు. దాంతో భయపడిపోయాను. వెంటనే తేరుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసి, కారులో కూర్చొని ఏడ్చాను. లేదంటే.. ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అయి ఉండేది. నా లైఫ్‌లో జరిగిన ఏకైక సంఘటన ఇదే. అందుకే.. ఆ తర్వాత ఆ దర్శకుడిని ఎప్పుడు కలవలేదు.. అని చెప్పుకొచ్చింది వర్షిణి.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే.. వర్షిణితో అసభ్యంగా ప్రవర్తించిన ఆ డైరెక్టర్ ఎవరు? అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఇప్పుడు వర్షిణి మంచి పొజిషన్లో ఉంది కాబట్టి.. అతని పేరు బయటికి చెప్పొచ్చు. కానీ అమ్మడు మాత్రం అతనెవరో చెప్పకుండా.. అప్ కమింగ్ బ్యూటీలు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.